![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -790 లో.... రేవతి బాబుని అపర్ణ బాగా చూసుకుంటుంది. అది చూడలేక "పాపం మా వదిన.. ఇంట్లో కోడలు ఉంది అయినా పాపం ఎవరో పిల్లాడిని పట్టుకొని ముద్దాడుతుంది.. అదేదో కావ్య బాబునో పాపనో ఇస్తే.. నువ్వు ఇలా ఎవరినో ముద్దాడాల్సిన అవసరం ఉండేది కాదు" రుద్రాణి అంటుంటే.. ఎందుకు అలా బాధపడే మాటలు మాట్లాడుతావంటూ రుద్రాణిపై ప్రకాష్, ఇందిరాదేవి కోప్పడతారు.
ఆ తర్వాత అందరు హాల్లో ఉండగా అప్పు ఫోన్ లో మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తూ.. ఓహ్ బాబు వాళ్ళ పేరెంట్స్ దొరికారా అయితే ఇప్పుడే బాబుని తీసుకొని స్టేషన్ కి వస్తున్నానని అంటుంది. బాబు వాళ్ళ పేరెంట్స్ దొరికారట.. నేను తనని తీసుకొని వెళ్తానని అప్పు ఇంట్లో చెప్తుంది. బాబు పేరెంట్స్ పేరేంటని రుద్రాణి ఎంక్వయిరీ చేస్తుంది. ఏవో పేర్లు చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడికి రప్పించండని రుద్రాణి అనగానే అలా వీలు అవ్వదని అప్పు సర్ది చెపుతుంది. సరే వాళ్ళ పేరెంట్స్ తో నేను ఫోన్ లో మాట్లాడుతా.. ఎందుకు ఇలా బాబుని పట్టించుకోకుండా వదిలేసారో కనుక్కుంటానని అపర్ణ అనగానే రేవతికి ఫోన్ చేస్తుంది అప్పు. మా అత్తయ్యగారు బాబు గురించి మీతో మాట్లాడుతారట అని చెప్పి ఫోన్ ని అపర్ణకి ఇస్తుంది అప్పు. బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అలా వదిలేసారని అపర్ణ అనగానే నేను కళ్ళు తిరిగి పడిపోయానని రేవతి టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. అయ్యో సారీ అండి బాబుని బాగా చూసుకున్నాను.. ఇక మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని రేవతికి చెప్తుంది అపర్ణ. ఆ తర్వాత నాకెందుకో డౌట్ గా ఉంది రాహుల్.. ఎందుకైనా మంచిది వాళ్ళని ఫాలో అవ్వమని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి.
ఆ తర్వాత రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడని దేవుడికి సంతోషంతో మొక్కుకుంటుంది కావ్య. అప్పుడే కావ్య వాంతి చేసుకుంటుంది. డౌట్ వచ్చి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. ప్రెగ్నెంట్ అని కన్ఫమ్ కావడంతో కావ్య షాక్ అవుతుంది. అప్పుడే అప్పు వస్తుంది.. తనని పట్టుకొని ఏడుస్తుంది.
తరువాయి భాగంలో రాజ్ ప్రపోజ్ చేస్తే.. మీరు అంటే నాకూ ఇష్టం లేదని కావ్య చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |